నా దృష్టిలో.. అతనికంటే.. కోహ్లీనే గొప్ప : ఇంగ్లాండ్ మాజీ
అయితే ఏ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయి అనే విషయం పైన కాదు.. ఇక జట్టులోని ఆటగాళ్లలో ఎవరు బెస్ట్ అనే విషయంపై కూడా పోల్చి చూస్తూ ఇక ఆటగాళ్లు రివ్యూల మీద రివ్యూ ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ స్మిత్, టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ లలో ఎవరు బెస్ట్ అనే విషయంపై ఇయాన్ చాపెల్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోహ్లీ వరల్డ్ కప్ లో మూడు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో 771 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. స్మిత్ విషయానికి వస్తే కేవలం 298 పరుగులు చేశాడు.
అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగజం ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్మిత్ తో పోల్చి చూస్తే కోహ్లీనే తన దృష్టిలో గొప్ప ఆటగాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈతరం క్రికెటర్లలో అతనే అత్యుత్తమ బ్యాట్స్మెన్. అతను బ్యాటింగ్ చేసే పద్ధతి అద్భుతంగా ఉంటుంది. ఫిట్నెస్ గురించి అయితే మాటల్లో వర్ణించడం కూడా కష్టమే. కోహ్లీ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు కావచ్చు. కానీ వికెట్ల మధ్య ఎలా పరిగెత్తుతున్నాడో చూడండి. దీనికంతటికి అతని ఫిట్నెస్ మైంటైనేన్సే కారణం అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా జట్టులో స్మిత్ కీలకమైన బ్యాట్స్మెన్ అయినప్పటికీ పూర్తిస్థాయిలో సత్తా చాటలేకపోతున్నాడు. స్పిన్ బౌలింగ్ ను అతని కంటే బాగా ఎవరు ఆడ లేరు అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ చాపిల్.