ఆ రికార్డును.. కోహ్లీ ఒక్కడే బద్దలు కొట్టగలడు : రవిశాస్త్రి

praveen
వరల్డ్ క్రికెట్ లో రికార్డ్ ల రారాజు అనే ప్రత్యేకమైన బిరుదును సొంతం చేసుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కెరియర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ కనబరుస్తున్న కోహ్లీ ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.ఏకంగా మూడు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 అదే సమయంలో తన ప్రదర్శనలతో ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. వరల్డ్ కప్ లో చేసిన మూడు సెంచరీలతో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టేసాడు. అయితే ఇక కోహ్లీ సాధించిన 50 సెంచరీల రికార్డును చేదించగలిగే ఆటగాడు.. నేటి జనరేషన్ లోనే కాదు తర్వాత జనరేషన్ లో కూడా మరొకరు ఉండబోరు అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ముందు మరో పెద్ద రికార్డు ఉంది.

 కోహ్లీని మరో సచిన్ రికార్డు ఊరిస్తుంది. అదే సచిన్ సాధించిన 100 సెంచరీల రికార్డు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డుకు  ఏ ప్లేయర్ కూడా దరిదాపుల్లో కూడా లేరు. ఒకవేళ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు అంటే అది కోహ్లీ మాత్రమే చేయగలడు. కోహ్లీ రికార్డు సాధిస్తాడా లేదా అని చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టే సత్తా ఒక్క కోహ్లీకే ఉందని అభిప్రాయపడ్డాడు. సచిన్ 100 సెంచరీలు చేసినప్పుడు ఎవరు అతని దగ్గరికి కూడా వస్తారని అనుకొని ఉండరూ. కానీ కోహ్లీ 80 సెంచరీలతో ఉన్నాడు. అతని లాంటి ప్లేయర్లకు అసాధ్యం అంటూ ఉండదు. కోహ్లీ తన నెక్స్ట్ మ్యాచ్ లలో మరో ఐదు శతకాలైన బాదడం మనం చూడొచ్చు. అతని ముందు ఇంకా మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితం ఉంది. దీంతో సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు అంటూ రవీ శాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: