చోకర్స్ ట్యాగ్ బ్రేక్ చేసి.. టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?

praveen
క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన వరల్డ్ కప్ పోరు కీలక దశకు చేరుకోగా.. నేడు మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ రెండు జట్లు ఎప్పుడు తలబడిన కూడా మ్యాచ్ ప్రేక్షకులకు అసలు సిసలైన  ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. ఉత్కంఠ అంతకుమించి అనే రేంజ్ లోనే ఉంటుంది. అయితే 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీమ్ ఇండియాని ఓడించింది.


 అప్పుడు టీమిండియా ఆటగాళ్ళు పెట్టిన కన్నీళ్లను ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేదు. అయితే ఇప్పుడు భారత జట్టు న్యూజిలాండ్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ అనుకుంటున్న వేళ.. భారత్ కి న్యూజిలాండ్ పై ఎక్కడ మంచి గణాంకాలు లేకపోవడం మాత్రం ఆందోళనకరంగా మారిపోయింది. అంతేకాదు ఇక సెమి ఫైనల్స్ విషయంలో భారత జట్టుకు ఛోకార్స్ అనే ఒక ట్యాగ్ కూడా ఉంది. కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేసే జట్లను ఎద్దేవ చేసేందుకు చోకర్స్ అనే మాటను చాలామంది వాడుతూ ఉంటారు. చోకర్స్ అనే పదం ఏ పటిష్టమైన టీం ఓడిపోయినా తెరమీదకి వస్తూనే ఉంటుంది.


 అయితే గత కొన్ని వరల్డ్ కప్ ల నుండి లీగ్ దశలో అదరగొట్టి సెమి ఫైనల్ లో మాత్రం చేతులెత్తేస్తూ నిరాశ పరుస్తున్న టీమ్ ఇండియాకు కూడా చోకర్స్ అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు లీగ్ దశలో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకొచ్చింది టీమిండియా. ఇప్పుడు సెమీఫైనల్ లో ఏం చేయబోతుంది అనే ఉత్కంఠ ఉంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై విజయం సాధించి టీం ఇండియా చోకర్స్ అనే ట్యాగ్ ని దూరం చేసుకుంటుంది అని అభిమానులు అందరూ కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: