బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి.. డిమాండ్ చేస్తున్న మాజీలు?

praveen
భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కొన్ని టీమ్స్ అంచనాలను అందుకోలేక దారుణమైన పరజాయాలను చవిచూసాయి అని చెప్పాలి. ఇలాంటి టీమ్స్ లో అటు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కూడా ఒకటి. అయితే ఇంగ్లాండ్ తర్వాత ఇలా భారీ అంచనాలతో బరిలోకి దిగి దారుణంగా విఫలమైన టీమ్స్ లో భారత దాయాది దేశంగా కొనసాగుతున్న పాకిస్తాన్ కూడా ఒకటి అని చెప్పాలి.


 ఏకంగా దాయాది గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా రాణించి  కప్పు గెలవాలని కసితో అటు వరల్డ్ కప్ లో బలిలోకి దిగింది పాకిస్తాన్. కానీ ఊహించని రీతిలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. చిన్న టీమ్స్ చేతుల్లో సైతం ఘోరంగా ఓడిపోయి.. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. బ్యాటింగ్ విభాగం బౌలింగ్ విభాగం ఎక్కడ సత్తా చాట లేకపోయింది. మరీ ముఖ్యంగా కెప్టెన్ బాబర్ తన వ్యూహాలతో జట్టును గెలిపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి. ఇక ఆటగాడిగా కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.


 అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలి అన్న డిమాండ్లు ఎక్కువై పోయాయి. ఇక ఇదే విషయంపై ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఇక సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలి అంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు అందరూ కూడా ముక్తకంఠంగా కోరుతున్నారు. ఆటపైన దృష్టి పెట్టాలి అని షోయబ్ మాలిక్, కమ్రాన్  అక్మాల్, అబ్దుల్ రజాక్ ఇప్పటికే సూచించారు. ఇక బాబర్ నాయకత్వంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి అంటూ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చినా అనుకున్న లక్ష్యాలను ఛేదించలేదు. ప్లేయర్గా ఇటు కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడు. అందుకే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అంటూ మాజీ ప్లేయర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: