వాంఖడేలో టాస్ ఎంతో కీలకం.. ఎందుకో తెలుసా?
ఈ నాలుగు టీమ్స్ మధ్య సెమీఫైనల్ పోరు హోరాహోరీగా జరగబోతుంది. రేపు మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ జరగబోతుందన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్, టీమిండియా ఎప్పుడు తలబడిన కూడా ఆ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారిపోతుంది. అదే సమయంలో 2019 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ లోనే న్యూజిలాండ్ టీం ఇండియాని ఓడించి ఇంటికి పంపింది. ఇక ఇప్పుడు ఏం జరగబోతుందో అనే విషయం గురించి అందరికీ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ వేదిక.. గత రికార్డులు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోతున్నాయి.
అయితే ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతూ ఉండగా.. ఈ మ్యాచ్లో టాస్ ఎంతో కీలకం అన్నది గత రికార్డులు చెబుతున్నాయ్. ఎందుకంటే ఈ స్టేడియంలో తొలిత బ్యాటింగ్ చేసిన జట్లే భారీ స్కోర్ చేసి ఎక్కువసార్లు విజయం సాధించాయ్. ఇదే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా 399 పరుగులు చేసి ఇక 229 పరుగులతో గెలిచింది. ఇక ఆ తర్వాత అదే సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ పై 382 పరుగులు చేసి 149 పరుగులు తేడాతో విజయం సాధించింది. శ్రీలంకపై ఇండియా 357 రన్స్ చేసి 302 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే ఎంతో కీలకం అన్నది తెలుస్తుంది.