అతను ఒక ఫెయిల్యూర్ కెప్టెన్.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?
దీనికి కారణం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో అతని ఆట తీరూ, అతని కెప్టెన్సీనే కారణం అని చెప్పాలి. అయితే వ్యక్తిగత ప్రదర్శన విషయంలో అయినా సరే అప్పుడప్పుడు కాస్త పరవాలేదు అనిపించినప్పటికీ.. అటు కెప్టెన్సీ విషయంలో మాత్రం అతని వ్యూహాలు అందరికీ చిరాకు తెప్పించాయి. దీంతో ఇక పాకిస్తాన్ జట్టు వరుస పరాజుయాలతో సతమతమయింది. కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టకుండా లీగ్ దశ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. దీంతో బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.
ఇకపోతే ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఆశించిన రీతిలో ప్రదర్శన చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ గా తనను తాను నిరూపించుకోవడానికి బాబర్ కు నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చారు. ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిని బాబర్ సరిగా వినియోగించుకోలేకపోయాడు. అతను ఒక విఫల కెప్టెన్. యూనిస్ ఖాన్ లో ఉన్న నాయకత్వ లక్షణాలు అటు బాబర్ లో మాత్రం ఎక్కడా లేవు అంటూ షాహిద్ వ్యాఖ్యానించాడు.