శ్రీలంక ఓటముల వెనుక.. పెద్ద కుట్ర.. చీఫ్ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొంతకాలం నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన లంక జట్టు ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయింది. ఆటగాళ్లు ఎవరూ కూడా ఫామ్ లో లేనట్లు కనిపించింది. దీంతో ప్రతి మ్యాచ్ లో కూడా బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో తడబాటు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే శ్రీలంక జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జట్టు సెలక్షన్ విషయంలో వివక్షపూరితంగా వ్యవహరించారు అంటూ ఆరోపణలు కూడా చేశారు ఆ దేశ క్రికెట్ ప్రేక్షకులు.


 అదే సమయంలో లంక బోర్డు వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని.. ఎంతో మంది రాజకీయ నాయకులు తమ పలుకుబడిని లంక బోర్డు వ్యవహారాలపై చూపిస్తున్నారు అంటూ గత కొంతకాలం నుంచి వస్తున్న ఆరోపణలు కూడా సంచలనగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన లంక బోర్డు మెంబర్షిప్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఇది కాస్త సంచలనగా మారిపోయింది.


 ఇలాంటి పరిస్థితుల మధ్య ఇటీవల శ్రీలంక చీఫ్ సెలెక్టర్ ప్రమోదయ విక్రమ సింఘో చేసిన కామెంట్స్ మాత్రం సంచలనగా మారిపోయాయ్. వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర ఓటముల వెనుక కుట్ర ఉంది అనిపిస్తుంది అంటూ శ్రీలంక చీఫ్ సెలెక్టర్ ఆరోపణలు చేసాడు. మా జట్టు దారుణ ప్రదర్శనకు నాదే బాధ్యత. కానీ ఈ ఘోర ప్రదర్శన వెనుక ఏదో కుట్ర ఉంది. బయట శక్తులు ఏవో పని చేశాయి. ఇక ఓటములకు అసలు విషయాలను రెండు రోజుల్లో బయటపెడతాను అంటూ చీఫ్ సెలెక్టర్ ప్రమోదయ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇటీవల లంక బోర్డుపై ఐసీసీ నిషేధం విధించిన నేపథ్యంలో.. ప్రమోదయ విక్రం సింఘో చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: