కేన్ మామ.. ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా హవా నడిపిస్తూ ఉన్నాడు. అయితే వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది స్టార్లు ప్లేయర్ లు ఉన్న కోహ్లీని మించిన వాడు మాత్రం ఇంకొకడు లేడు అనే విధంగా అతని ప్రస్థానం కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే అతను నేటి తరానికి లెజెండ్ గా చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆటతీరుతో అందరికీ అర్థమయ్యేలా చేసాడు విరాట్ కోహ్లీ. ఎంతోమంది లెజెండ్స్ రికార్డులను బద్దలు కొట్టాడు.

 ఈ క్రమంలోనే అతను కూడా ఒక లెజెండ్ అన్న విషయాన్ని నిరూపించాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ ఆటను కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో సైతం ఎంతో అభిమానిస్తూ ఉంటారు. ఇక కోహ్లీ ఆటను చూసేందుకు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే కేవలం క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ ఇక మిగతా స్టార్ క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీ నుంచి స్ఫూర్తి పొందుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని అడిగితే దాదాపుగా అందరూ కూడా కోహ్లీ పేరునే చెబుతూ ఉంటారు.

 ఇటీవల కోహ్లీ స్నేహితుడు న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం తన ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ అంటూ చెబుతున్నాడు   ప్రస్తుతం తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ స్టార్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ, విలియమ్సన్ ఇద్దరు కూడా అండర్ 19 క్రికెట్ లో తమ తమ జట్లకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. ఇక కేన్ విలియమ్సన్  ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి తెలుగు క్రికెట్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక విలియమ్సన్ తన ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ అని చెప్పడంతో రన్ మిషన్ ఫాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఇకపోతే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై విజయం సాధించి దాదాపు సెమీఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: