సెమీఫైనల్ కి, ఎలిమినేషన్ కి మధ్యలో.. నలిగిపోతున్న మూడు టీమ్స్?
ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా మొదట భారత్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇటీవల ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ లో అధికారికంగా అర్హత సాధించాయి. అయితే ఇప్పుడు నాలుగో స్థానంలో ఏ జట్టు ఛాన్స్ దక్కించుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ నాలుగవ స్థానం కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ ఉంది అని చెప్పాలి. అయితే నెదర్లాండ్స్ శ్రీలంక బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే టోర్ని నుంచి నిష్క్రమించాయి. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మాత్రం ఇంకా ఎలిమినేషన్ కి సెమీఫైనల్ కి మధ్య నలిగిపోతూ ఉన్నాయి అని చెప్పాలి.
అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. శ్రీలంక తమ ముందు ఉంచిన 23.3 ఓవర్లలోనే చేదించింది. దీంతో ఇక ఒక్కసారిగా న్యూజిలాండ్ రన్ రేట్ పెరిగిపోయింది. దీంతో ఇక పాయింట్లు పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది అని చెప్పాలి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో పోల్చి చూస్తే అటు న్యూజిలాండ్ కే సెమి ఫైనల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమి ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం లేదు అని చెప్పాలి.