ఆటగాళ్లు, టీమ్స్ కాదు.. వరల్డ్ కప్ టోర్నినే అరుదైన రికార్డు?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎన్నో సంచలన రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ప్రతి మ్యాచ్ లో కూడా రసవతరమైన పోరు కొన సాగుతుంది. ఈ ప్రతి పోరులో రెండు టీమ్స్ కూడా పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ భారీ స్కోర్లు నమోదు చేస్తూ ఉన్నాయి. ఇక ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతి మ్యాచ్లో సెంచరీల మోత మోగుతుంది.


 ఏకంగా టి20 ఫార్మాట్ తరహా లోనే ప్రత్యర్థులపై సిక్సర్లు  ఫోర్ లతో విరుచుకుపడుతున్న బ్యాట్స్మెన్లు ఇక భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు. ఇలా వ్యక్తిగత రికార్డుల విషయంలోనే కాదు ఇక ఆయా జట్లు కూడా అరుదైన రికార్డులు సృష్టిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు ఆటగాళ్లు లేదా ఆయా టీమ్స్ రికార్డులు సృష్టించడం కాదు ఏకంగా వరల్డ్ కప్ టోర్నినే ఒక అరుదైన రికార్డును సృష్టించింది. దీనికి అంతటికీ కారణం ఇక ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఫుల్ ఫామ్ చూపిస్తూ అదరగొడుతున్న ఎంతోమంది బ్యాట్స్మెన్లు అని చెప్పాలి.


 వన్డే వరల్డ్ కప్ లో ఇటీవల మరో రికార్డు బ్రేక్ అయింది. ఏకంగా 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఈ సీజన్లో తొలిసారిగా సిక్సర్లు 500 కు పైగా నమోదు అయ్యాయి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇలా 500 సిక్సర్లే అత్యధికం కావడం గమనార్హం. దీన్నిబట్టి ఇక ఈ ప్రపంచ కప్ టోర్నీలో బ్యాట్స్మెన్ల విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ కి గాను అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ శర్మ, మిచెల్ మార్ష్ 22 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నారు. ఇంకా మ్యాచ్ లు జరగాల్సి ఉన్న నేపథంలో మరికొన్ని రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: