ఎలుకల ప్యాడ్స్ పై నిషేధం.. ఎందుకో తెలుసా?

praveen
సాదరణంగా ప్రతి ఇంట్లో కూడా ఎలకల బెడదా ఉంటుంది. అయితే కొందరిని ఇంట్లో ఏకంగా ఎలుకల బెడద తీవ్ర ఇబ్బందులకు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంట్లో నక్కి ఉన్న ఎలుకలను తరిమికొట్టేందుకు ఇక ఇంటి యజమానులు పడే పాట్లు అయితే మాటల్లో వర్ణించడం అన్ని కావు. ఒకప్పుడు అయితే ఎలుకల బోన్లు ఏర్పాటు చేసి వాటిని పట్టుకుని బయట వదిలేసేవారు. కానీ ఇటీవల వినూత్నంగా అందుబాటులోకి వచ్చిన కొన్ని  ఎలుకల ప్యాడ్స్ ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఎలుకలను పట్టే గ్లూ ప్యాడ్స్ ని వాడుతూ ఉన్నారు.


 అయితే ఈ ఎలుకల ప్యాడ్స్ పై గత కొంతకాలం నుంచి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిషేధం వేధిస్తూ వస్తుంది. అయితే ఇలా ఎలుకల ప్యాడ్స్ ని వాడుతూ హింసిస్తున్న వారిని జంతు హింస చట్టం 1960 ప్రకారం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్  అరుణాచల్ ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, లక్షద్వీప్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరఖండ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ ప్యాడ్స్ నిషేధించాయి.


 అయితే ఈ జిగురు బోర్డును ఉపయోగించడం వల్ల ఎలుకలు వాటి పైకి రాగానే ఇరుక్కుపోతుంది. దీని తర్వాత అది విసిరి వేయబడుతుంది.  ఈ క్రమంలోనే ఈ పేపర్ బోర్డును నిషేధించిన 17వ రాష్ట్రంగా పంజాబ్ అవతరించింది. కేవలం ఎలుకలు మాత్రమే కాదు ఉడుతలు పక్షులను చంపడానికి కూడా ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ప్యాడ్స్ ద్వారా దారుణంగా ఎలుకలను చంపడంతో సామాజిక కార్యకర్తలు దీనిని నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇక ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్లు ఎక్కువ కావడంతో గ్లూ జీగురు ప్యాడ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: