వరల్డ్ కప్ లో.. మరోసారి ఇండియా vs పాక్ మ్యాచ్ జరగాలంటే?
దీంతో వరల్డ్ క్రికెట్లో ఉన్న అన్ని టీమ్స్ మధ్య జరిగినట్లుగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. కేవలం వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలబడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే దాయాది దేశాలుగా కొనసాగుతున్న ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలబడిన హోరాహోరీ హోరు ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో విజయాన్ని వరల్డ్ కప్ గెలిచిన ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు. అయితే వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది అని చెప్పాలి.
అయితే ఈ వరల్డ్ కప్ లో మరోసారి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే బాగుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే వరల్డ్ కప్ లో ఇప్పటికే భారత్ సెమిస్ చేరింది. మరి భారతను ఢీకొట్టాలంటే నవంబర్ 11న ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో పాకిస్తాన్ భారీ తేడాతో గెలవాలి.. దీంతో పాటు శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఈ మ్యాచ్ రద్దు అయిన కూడా పాకిస్తాన్ కు సెమీఫైనల్ అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలా అన్నీ కలిసి వచ్చి పాకిస్తాన్ సెమీఫైనల్ అడుగుపెట్టింది అంటే సెమీఫైనల్ లో మరోసారి మొదటి స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది.