సెంచరీ మిస్సైనా.. సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ సీజన్లో ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇక జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇలా భారీగా పరుగులు చేస్తూ ఎన్నో అరుదైన రికార్డులను కూడా కొల్లగొడుతున్నాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్. రికార్డుల కింగ్ గా పేరు ఉన్న ఈ బ్యాట్స్మెన్ కి అరుదైన రికార్డులు కొత్తేమి కాదు. అయితే ఇప్పటికే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఒక సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ.


 దీంతో వన్డే ఫార్మాట్లో 48 సెంచరీలకు చేరుకున్నాడు. మరో సెంచరీ చేశాడు అంటే చాలు అటు సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేస్తాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అభిమానులు అందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారూ. అందరిలో అంచనాలను పెంచేస్తున్నాడు. కానీ చివర్లో సెంచరీకి చేరువగా వచ్చి చివరికి వికెట్ కోల్పోతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది. 88 పరుగులు చేసి సెంచరీ చేస్తాడు అనే నమ్మకాన్ని కలిగించిన కోహ్లీ అంతలోనే వికెట్ కోల్పోయాడు.


సెంచరీ మిస్ అయిన అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 1000కి పైగా పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 8 క్యాలెండర్ ఇయర్స్ లో అతను వెయ్యికి పైగా పరుగులను పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ తర్వాత స్థానంలో సచిన్ ఏడుసార్లు ఈ రికార్డు సాధించి రెండవ స్థానంలో ఉండగా.. తర్వాత సౌరబ్ గంగూలీ 6, సంఘకర 6, రికీ పాంటింగ్ 6, రోహిత్ శర్మ 4 సార్లు ఇలా ఒక క్యాలెండర్లో వెయ్యికి పైగా పరుగులు సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: