భారత జట్టును ఎందుకు పొగడకూడదు.. నేటిజన్స్ కు కౌంటర్ ఇచ్చిన అక్తర్?
విశ్లేషకులు. అయితే ఇది ముమ్మాటికి నిజం అన్న విషయాన్ని ఇటీవల వరల్డ్ కప్ లో నిరూపిస్తుంది టీమిండియా. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ఎంతో సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతుంది టీమిండియా. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడితే అన్ని మ్యాచ్లలో కూడా విజయ డంకా మోగించింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే భారత జట్టుకు తిరుగులేదు అనే విధంగానే ప్రస్థానం సాగుతోంది. ఇక ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయకుండా పూర్తి ఆధిపత్యాన్ని చలా ఇస్తుంది టీమిండియా. ఈ క్రమంలోనే దాదాపు ఇప్పటికే సెమీఫైనల్ బెర్తును కూడా కన్ఫార్మ్ చేసుకుంది అని చెప్పాలి దీంతో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత కేవలం భారత మాజీ ప్లేయర్లు మాత్రమే కాదు దాయాతి దేశమైన పాకిస్తాన్ మాజీలు సైతం ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవల పాకిస్తాన్ మాజీ షోయన్ అక్తర్ వరల్డ్ కప్ లో టీమిండియా కు తిరుగులేదని.. ఆ జట్టును అడ్డుకునే మరో టీం కనిపించట్లేదని.. ఈసారి భారత జట్టు టైటిల్ గెలవకపోతే ఆశ్చర్యపోతాను అంటూ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు.
ఈ క్రమంలోనే దాయాది దేశమైనా భారత్ ను పొగడటం ఏంటి అని కొంతమంది నెటిజెన్స్ షోయబ్ అక్తర్ ను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అయితే ఇక ఈ ప్రశ్నలపై ఆసక్తికర సమాధానం చెప్పాడు పాకిస్తాన్ దిగ్గజం. టీమిండియా వరల్డ్ కప్ లో ఆడిన ఆరు మ్యాచ్లలో కూడా గెలిచింది. 230 పరుగులు చేసి కూడా టార్గెట్ ను కాపాడుకొని 100 రన్స్ తేడాతో విజయం సాధించింది. వాళ్లుమంచి క్రికెట్ ఆడుతున్నారు. ప్రశంసలకి అర్హులు అంటూ అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియాను ఎందుకు పొగడకూడదు అంటూ తనను ప్రశ్నిస్తున్న వారిని తిరిగి ప్రశ్నించాడు ఈ పాకిస్తాన్ దిగ్గజం.