పాతికేళ్లలో ఆఫ్ఘనిస్తాన్ లాగా.. ఆ టీం చేయలేకపోయింది : సెహ్వాగ్
గతంలో డిపెండెంట్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టును ఓడించి వరల్డ్ కప్ చరిత్రలోనే సంచలన విక్టరీని నమోదు చేసింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇక ఆ తర్వాత పాకిస్తాన్ జట్టును కూడా దారుణంగా ఓడించింది అని చెప్పాలి. ఇక ఇటీవల శ్రీలంక టీంను కూడా ఓడించి మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్గనిస్తాన్ చిన్న జట్టుల ఎలాంటి అంచనాలు లేకుండా వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టిన ఈ జట్టు ఎన్నో సంచలన విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ సాధిస్తున్న విషయాలపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్య పోతుంది. ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో శ్రీలంక లాంటి ఛాంపియన్ టీం పై కూడా గెలిచిన ఆప్కానిస్తాన్. దీంతో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ కప్ లో ఆడుతున్న ఇతర టీమ్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ను చూసి చాలా నేర్చుకోవాలి అంటూ అభిప్రాయపడ్డాడు ఈ మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపనర్. బంగ్లాదేశ్ జట్టు దాదాపు పాతికేళ్ల నుంచి వరల్డ్ కప్ లో ఆడుతున్న.. ఆఫ్ఘనిస్తాన్ తరహాలో పెద్ద టీమ్స్ పై వరుసగా విజయాలు సాధించలేకపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన పురోగతిని సాధించింది అంటూ ప్రశంసించాడు.