ప్రపంచ రికార్డు సృష్టించిన.. ఐపీఎల్ బిల్డప్ బాబాయ్?

praveen
ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. సొంత గడ్డపై టైటిల్ ఫేవరెట్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు తగ్గట్టుగానే ప్రదర్శన చేస్తుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని టీం గా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్ లలో కూడా అన్నింట్లో విజయం సాధించి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారత జట్టు దూకుడు చూస్తుంటే ఈ ఏడాది వరల్డ్ కప్ గెలవడం ఖాయమని అటు ఫాన్స్ అందరు కూడా ఫిక్స్ అయిపోతున్నారు అని చెప్పాలి.


 ఇలా జట్టులో ఉన్న సీనియర్లు అందరూ కూడా వరల్డ్ కప్ లో వరుసగా మ్యాచ్లు ఆడుతూ బిజీగా ఉన్నారు. అయితే అటు భారత జట్టులో యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రస్తుతం దేశవాళీ టోర్నీ అయినా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా వరుస మ్యాచ్లతో బిజీగా ఉన్నారు అని చెప్పాలి  ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్స్ ఈ టోర్నీలో సాధిస్తున్న రికార్డులు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. వరుసగా అదిరిపోయే ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు యువ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బిల్డప్ బాబాయ్ అనే ఒక ట్యాగ్ సొంతం చేసుకున్న ఆటగాడు ఇక ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలో మాత్రం ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.


 ఆ ప్లేయర్ ఎవరో బిల్డప్ బాబాయ్ అని చెప్పగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. అతను ఎవరో కాదు రియాన్ పరాగ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా అసోం జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్ హిస్టరీలో వరుసగా 6 మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా ఘనత సాధించాడు. ఈ ట్రోఫీలో అతను 61, 76, 53, 76, 72, 57 స్కోర్ లతో అదరగొట్టాడు. అలాగే తొమ్మిది వికెట్లను పడగొట్టడం కూడా విశేషం. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న రియాన్ పరాగ్ జట్టు విజయాలలో కూడా కీలక పాత్ర వహిస్తున్నాడు. కాగా ఐపీఎల్లో ఇతను రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అతి చేయడంతో బిల్డప్ బాబాయ్ అంటూ కొంతమంది ఇతన్ని పిలవడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: