పాకిస్తాన్ జట్టు.. తప్పకుండా సెమీఫైనల్ చేరుతుంది?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భారీ అంచనాలతో భారీ లోకి దిగింది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే తప్పకుండా సెమీఫైనల్కు కూడా చేరుకుంటుందని ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా అంచనా వేశారు. కానీ ఊహించిన రీతిలో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఒకరకంగా దారుణమైన పరాజయాలతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ప్రత్యర్థులకు   కనీస పోటీ ఇవ్వలేక దారుణంగా చతికిలబడిపోయింది.


 ఇప్పటివరకు వరల్డ్ కప్ లో భాగంగా ఏకంగా ఐదు మ్యాచ్లు ఆడింది పాకిస్తాన్. కేవలం రెండే రెండు విజయాలు సాధించింది. మూడు ఓటములతో ప్రస్తుతం డీల పడిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఏకంగా పసికూన ఆఫ్ఘనిస్తాన్  చేతిలో దారుణ పరాజయాన్ని చవిచూసింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఆ జట్టు ప్రదర్శనమై తీవ్ర ఆగ్రహ ఆవేశాలను కూడా వ్యక్తపరిచారు.  అయితే నేడు పాకిస్తాన్ జట్టు పటిష్టమైన సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తప్పక గెలవాల్సి ఉంది.


 ఈ క్రమంలోనే మ్యాచ్కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఐదు మ్యాచ్లలో మూడు ఓటములతో పాకిస్తాన్ జట్టు కాస్త డీల పడినప్పటికీ తాము ఖచ్చితంగా తిరిగి పుంజుకుంటాము అంటూ ధీమా వ్యక్తం చేశాడు షాదాబ్ ఖాన్. మేము అద్భుతాలను నమ్ముతాం. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి గతంలోనూ తిరిగి పుంజుకున్నాము  మేము ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరుతామని ఆశాభావం గా ఉన్నాము అంటూ షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే అతను ఎన్ని మాటలు చెప్పినా ప్రస్తుతం పటిష్టంగా కనిపిస్తున్న సౌతాఫ్రికా ను ఓడించడం అంత సులభతరమైన విషయం కాదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: