ఇండియా ఒక మ్యాచ్ ఓడిపోయిన పర్వాలేదు.. రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఒక్క ఓటమి కూడా ఎరుగని టీం ఏది అంటే అందరూ టీమిండియా పేరు చెబుతారు. అయితే నిన్నటి వరకు కూడా ఈ లిస్టులో న్యూజిలాండ్ పేరు కూడా వినిపించేది. ఎందుకంటే ఒకవైపు ఇండియా నాలుగు మ్యాచ్ లకు గాను నాలుగు విజయాలు సాధిస్తే న్యూజిలాండ్ కూడా నాలుగు ఆడి అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది. అయితే ఇటీవల ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది అయితే ఒక మ్యాచ్ జరిగింది అంటే చాలు ఏదో ఒక జట్టుకు మాత్రమే విజయం వరిస్తుంది. ఆ విజయం భారత జట్టుకు వరించింది అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో.. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా ఇక ప్రస్తుత వరల్డ్ కప్ లో తప్పకుండా విశ్వవిజేతగా నిలుస్తుందని భారీగానే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఒక విషయం అందరిని ఆందోళన కలిగిస్తుంది. గతంలోనూ ఇలా లీగ్ మ్యాచ్లలో వరుస విజయాలు సాధించిన టీమిండియా కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది.


 దీంతో ఈసారి కూడా ఇలా అవుతుందా అనే ఆందోళన అభిమానుల్లో మాత్రం ఉంది. అయితే ఇదే విషయం గురించి భారత మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లీగ్ మ్యాచ్ లలో టీమిండియా ఓడిన పర్వాలేదు అంటూ అభిప్రాయపడ్డాడు. ఏ సెమిస్ లోనో ఓడటం కంటే లీగ్ మ్యాచ్ లోనే ఓడిపోయి.. జట్టులో ఏం సమస్యలు ఉన్నాయి అనే విషయం పై అప్రమత్తం కావడం మంచిది అంటూ సూచించాడు. భారత అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లీగ్ మ్యాచ్లలో ఓడిన పర్వాలేదు. కానీ సెమీఫైనల్ లో మాత్రం ఓడిపోవద్దు అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: