టీమిండియాకు బిగ్ షాక్.. రవీంద్ర జడేజాకు గాయం?

frame టీమిండియాకు బిగ్ షాక్.. రవీంద్ర జడేజాకు గాయం?

praveen
ప్రస్తుతం టీమిండియా భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. పుష్కరకాలం తర్వాత ఇండియా వేదికగా ఐసిసి ఈవెంట్ జరుగుతూ ఉండగా.. ఇక భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ టైటిల్ ఈసారి తప్పకుండా గెలుస్తుందని అభిమానులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే టీం ఇండియా కూడా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయింట్లు పట్టికలో టాప్ లో ఉంది టీమిండియా. నాలుగు మ్యాచ్లలో కూడా నాలుగు విజయం సాధించి ప్రస్తుతం ఓటమి ఎరుగని టీం గా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. అలాంటి టీమ్ ఇండియా నేడు వరుస విజయాలతో దూసుకుపోతున్న పటిష్టమైన న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడ పోతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్ళు గాయం బారిన పడుతున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే.



 దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడి వెళ్లిపోయాడు. అయితే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారు అని చర్చ జరుగుతున్న సమయంలో ఇక ఇప్పుడు మరో స్టార్ ఆల్ రౌండర్ గాయం బారిన పడ్డాడు అంటూ వార్త తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా కూడా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ కి ముందు జడేజా సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు పాత గాయం తిరగబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోనే అతను గాయం నొప్పితో ఇబ్బంది పడ్డాడట. ఇక న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ లో అతన్ని ఆడించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: