రోహిత్ కు సరైన గౌరవం దక్కలేదు.. ఆకాష్ చోప్రా కామెంట్స్?
ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండు మ్యాచ్లలో కూడా ఘనవిజయాన్ని సాధించింది. మొదటి మ్యాచ్ లో పటిష్టమైన ఆస్ట్రేలియాను రెండవ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. అయితే మొదటి మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగిన కెప్టెన్ రోహిత్ శర్మ అటు రెండో మ్యాచ్లో మాత్రం సెంచరీతో చెలరేగాడు.
ఇక ఈ సెంచరీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా ఇరగదీయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. కాగా రేపు పాకిస్తాన్తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ ఫామ్ గురించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ క్రీజూలో కుదురుకున్నాడు అంటే వార్ వన్ సైడ్ అయిపోతుంది అంటూ పేర్కొన్నాడు. ప్రపంచ కప్ చరిత్రలో ఏడు సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా ఉన్న రోహిత్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.