బాబర్ పై.. పాకిస్తాన్ మాజీ షాకింగ్ కామెంట్స్?
ప్రపంచ కప్ మ్యాచ్ లలో భాగంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ ఆకట్టుకోవాల్సిన బాబర్ ఇక వరుసగా రెండు మ్యాచ్లలో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కె పరిమితం అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని పాము పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ మరోసారి ఫ్లాప్ అయ్యాడు అంటూ విమర్శలు గుప్పించాడు. బాబర్ విఫలమైనప్పటికీ మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడు మరొకరు దొరికాడని చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్.
అచ్చం బాబర్ లాగే ప్రదర్శన చేసే అబ్దుల్లా షఫీక్ ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో ఉన్నాడు అంటూ అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి బాబర్ గొప్ప ఆటగాడు అయినప్పటికీ ఇలాంటి పెద్ద మ్యాచ్లలో పరుగులు కావాల్సిందే. రాబోయే మ్యాచ్ లలో బాబర్ కచ్చితంగా కం బ్యాక్ అవుతాడని మంచి ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు షోయబ్ అక్తర్. అయితే బాబర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన అక్తర్ పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమికి కారణం అవుతున్నాడు. పాకిస్తాన్ బౌలర్ల పై మాత్రం ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం. తాను ఎప్పుడూ బౌలర్లకు అండగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.