పేద బాలికని ఆదుకున్న KL రాహుల్?

Purushottham Vinay
టీమిండియా స్టార్ క్రికెటర్‌ కే ఎల్‌ రాహుల్‌ రీఎంట్రీలో సూపర్ డూపర్ గా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో టాప్‌ క్లాస్‌ ఫామ్‌తో ఆకట్టుకుంటూ పరుగుల వరద పారిస్తున్నాడు రాహుల్.కాగా కేవలం ఆటతోనే తన సేవా కార్యక్రమాలతో కూడా రాహుల్ వార్తల్లో నిలుస్తున్నాడు. పేదరికంతో బాధపడుతోన్న ఓ విద్యార్థినికి తన వంతుగా ఆర్థిక సాయం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.నిరుపేద జీవితం గడుపుతున్న ఓ పేద విద్యార్థినికి టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ దేవుడిలా సహాయం చేశారు. ధార్వాడలోని సిద్దేశ్వర్‌ కాలనీకి చెందిన హనుమంతప్ప ఇంకా సుమిత్ర దంపతుల కుమార్తె సృష్టి భవిష్యత్తులో డాక్టర్‌ కావాలని కలలు కంది. అయితే ఆ బాలిక కలకు పేదరికం అనేది అడ్డంకిగా మారింది.ఇక ఈ కుటుంబం పడుతున్న ఆర్ధిక కష్టాలను తెలుసుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మంజునాథ్ హెబాసూర్ ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను సంప్రదించడం జరిగింది. ఆ అమ్మాయి ఆర్థిక కష్టాలను టీమిండియా క్రికెటర్‌ దృష్టికి తీసుకెళ్లాడు.


దీనికి వెంటనే స్పందించిన రాహుల్‌ ఆ అమ్మాయి చదువుకు అవసరమైన ఆర్థిక సహాయంని దేవుడిలా అందజేశాడు.దీపకా గాంకర్, అనితా గాంకర్ నేతృత్వంలో 1996లో ప్రారంభమైన గ్లోబల్ ఎక్సలెన్స్ స్కూల్ అనేది చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ పాఠశాలలో సృష్టి కులవి చదువుకోవడానికి రాహుల్ ఆర్థికంగా ఎంతో సహకరించారు. ఇక ఇది మా పాఠశాలకు, మనకు గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపాల్‌ మాలాశ్రీ నయ్యర్‌ చెప్పుకొచ్చారు.నిత్యం క్రికెట్‌లో బిజీగా ఉండే రాహుల్‌.. ఓ విద్యార్థికి చదువు కోసం ఆర్థిక సాయం చేసి చాలా మంచి పనిచేశాడంటూ క్రికెట్ అభిమానులు, నెటిజన్లు టీమిండియా క్రికెటర్‌ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రాహుల్ ప్రస్తుతం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చాడు. ఇండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పుడు, రాహుల్ విరాట్ కోహ్లీతో కలిసి అజేయంగా 97 పరుగులు చేసి సిడిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: