వరల్డ్ కప్ టోర్నీలలో.. అత్యధిక సెంచరీలు చేసిన జట్టు ఏదో తెలుసా?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్ టీమ్ ఇండియాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పాలి. అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఈ వరల్డ్ కప్ పై ప్రేక్షకులు అందరిలో కూడా భార్య రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ మెగా టోర్ని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

 వరల్డ్ కప్ లో ఏ టీం ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఒక అంచనాకు వస్తూ సోషల్ మీడియాలో తెగ రివ్యూ ఇచ్చేస్తూ ఉన్నారు మాజీ ప్లేయర్లు. అదే సమయంలో గత వరల్డ్ కప్లలో కొన్ని టీమ్స్ సాధించిన అరుదైన రికార్డులకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో ఎక్కువ సెంచరీలు చేసిన టీం ఏది అన్న విషయం గురించి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిస్తున్నారు. ఆ వివరాలు చూసుకుంటే టీమిండియానే ఈ విషయంలో టాప్ లో ఉంది అని చెప్పాలి.

 వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ టోర్నీలలో ఇప్పటివరకు 32 సెంచరీలు నమోదు చేశారు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో పటిష్టమైన ఆస్ట్రేలియా భారత్ కంటే ఒక్క సెంచరీ వెనకబడి 31 సెంచరీలతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత వరుసగా శ్రీలంక 25,వెస్టిండీస్ 19, ఇంగ్లాండ్ 18, న్యూజిలాండ్ 17 పాకిస్తాన్ 16, సౌత్ ఆఫ్రికా 15, జింబాబ్వే 6, బంగ్లాదేశ్ 5, ఐర్లాండ్ 5 సెంచరీలతో ఈ లిస్టులో ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: