వరల్డ్ కప్ గెలవడానికి టీమ్ ఇండియా సిద్ధంగా ఉంది.. కానీ : కపిల్ దేవ్

frame వరల్డ్ కప్ గెలవడానికి టీమ్ ఇండియా సిద్ధంగా ఉంది.. కానీ : కపిల్ దేవ్

praveen
అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఈ ఐసీసీ టోర్నికి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ మెగా టోర్నీ పైనే అందరి దృష్టి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అటు టీమ్ ఇండియాకు మంచి కాన్ఫిడెన్స్ పెరిగింది. దీనికి కారణం ఆసియా కప్ విజేతగా నిలబడమే. వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ లో మొదటినుంచి మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన టీమిండియా ఇక ఫైనల్ లో శ్రీలంక టీంని చిత్తుగా ఓడించి చివరికి ఆసియా విజేతగా నిలిచింది.


 ఇక టీమిండియా ఆట తీరు చూస్తే వన్డే వరల్డ్ కప్ తప్పకుండా గెలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అటు భారత క్రికెట్ విశ్లేషకులు. ఇదే విషయం గురించి టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ లో టీమిండియా గెలవడం ఖాయమని కానీ అదృష్టం కూడా కలిసి రావాలి అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. జమ్ము తావి గోల్ఫ్ లో జరగనున్న జే అండ్ కే ఓపెన్ మూడో ఎడిషన్ ప్రారంభించిన సందర్భంగా కపిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.


 మొదటి నాలుగు స్థానాల్లోకి రాగలిగితే అది ఎంతో ముఖ్యమైనది. ఇక అదృష్టంతో పాటు మరెన్నో విషయాలకు సంబంధించి ఉంటుంది అంటూ కపిల్ వ్యాఖ్యానించాడు . భారత్ టైటిల్ ఫేవరెట్ అని ఇప్పుడే చెప్పలేం. అయితే భారత జట్టు చాలా బాగుంద. ట్రోఫీ కోసం కష్టపడాలి . నాకు భారత టీం గురించి తెలుసు. ఇతర జట్ల గురించి నాకు తెలియదు అంటూ కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టు బరిలోకి దిగేందుకు ఛాంపియన్గా నిలవడానికి సిద్ధంగా ఉంది. ఉద్రేకంతో ఆడుతూ ఆటగాళ్లు తమను తాము ఆస్వాదించాలి అంటూ సూచించాడు కపిల్ దేవ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: