జడేజా అరుదైన ఘనత.. కపిల్ దేవ్ తర్వాత?

praveen
ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఫీల్డింగ్ లో ఇలా ప్రతి విభాగంలో కూడా తనకు ఎవరూ సాటి లేరు అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపిస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా. ఇక అసలు సిసలైన నికార్సైన ఆల్రౌండర్ అనే పదానికి అతను చిరునామాగా ఉంటాడు అని చెప్పాలి. మా టీంలో కూడా జడేజా లాంటి ఆల్ రౌండర్  ఉంటే ఎంత బాగుండు అని ప్రత్యర్థి టీమ్స్ కుళ్లుకునేలా  అతను ప్రదర్శన చేస్తూ ఉంటాడు.

 ఇలా ఇప్పటివరకు ఎన్నోసార్లు అదిరిపోయే ప్రదర్శన చేసి.. భారత జట్టుకు క్లిష్ట పరిస్థితుల్లో విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉంటాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఇలా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రవీంద్ర జడేజా.. ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఆసియా కప్ లో భాగంగా జడేజా అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల  బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్లు వేసిన రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. ఈ ఒక్క వికెట్ తో అరుదైన రికార్డ్ అతని ఖాతాలో చేరిపోయింది.

 వన్డే ఫార్మాట్లో 200 వికెట్లు పడగొట్టిన ఏడవ భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. అయితే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే 337, జవగల్ శ్రీనాథ్ 315,అజిత్ అగర్కర్ 288, జహీర్ ఖాన్ 282, హర్భజన్ సింగ్ 269, కపిల్ దేవ్ 253 వికెట్లతో  ఈ ఘనత సాధించిన భారత ప్లేయర్లుగా జడ్డు కంటే ముందు ఉన్నారు. అదే సమయంలో వన్ డే ఫార్మాట్లో 2500+  రన్స్ తో పాటు రెండు వందల వికెట్లు తీసిన రెండో భారత ఆల్రౌండర్ గా నిలిచాడు రవీంద్ర జడేజా. జడేజా కంటే  ముందు 3783 పరుగులు 253 వికెట్లతో కపిల్ తో మొదటి స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: