వారెవ్వా గిల్.. కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్?

praveen
ఇటీవల కాలం లో టీమిండియా లో యంగ్ ప్లేయర్స్ హవా ఎంతలా పెరిగి పోయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అదరగొడుతూ ఉన్నారు. ఈ క్రమం లోనే జట్టులోకి వచ్చిన తక్కువ సమయం లోనే తమకంటూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇక ఎన్నో అరుదైన రికార్డులు కూడా తమ ఖాతా  లో వేసుకుంటున్నారు యంగ్ క్రికెటర్లు.

 అయితే ఇలా గత కొంత కాలం నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లలో యంగ్ ఒపెనర్ శుభమన్ గిల్ తోపాటు ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఒకవైపు గిల్ సెంచరీల మోత మోగిస్తూ అటు ర్యాంకింగ్స్ లో దూసుకుపోతూ ఉంటే.. అటు ఇషాన్ కిషన్ కూడా జట్టుకు అవసరమైనప్పుడల్లా మంచి ప్రదర్శన చేస్తూ ఇక జట్టు విజయాలలో కీలకమైన ప్రదర్శన పోషిస్తూ ఉన్నాడని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు యంగ్ ప్లేయర్స్ ఇటీవలే వన్డే వరల్డ్ కప్ కి కూడా ఎంపికయ్యారు అంటే వారి ఫామ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

 వన్డే వరల్డ్ కప్ లో ఎంపిక కావడమే కాదు.. ఇటీవల ఏకంగా ఐసిసి ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో కూడా ఈ ఇద్దరు ప్లేయర్లు సత్తా చాటారు. కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నారు. ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో 750 పాయింట్లతో గిల్ మూడవ స్థానంలో నిలువగా ఇక 624 పాయింట్లతో ఇషాన్ కిషన్ 24 వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ర్యాంకులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఎప్పటి లాగానే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇక భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పదవ ర్యాంకులో కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: