ప్రపంచ కప్ కోసం.. భారత జట్టును ప్రకటించేది ఆరోజేనట?
కానీ ఇప్పుడు వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇక వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా లో ఎవరు ఉంటారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల ఆసియా కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కూడా తమ జట్టు వివరాలను ప్రకటించిన నేపథ్యంలో.. ఇక బిసిసిఐ ఎప్పుడు ఏ జట్టును వివరాలను రివిల్ చేయబోతున్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే సెప్టెంబర్ మూడవ తేదీన బీసీసీఐ వరల్డ్ కప్ జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే అంతకుముందే ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ రెండవ తేదీన అటు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరమే బీసీసీఐ వరల్డ్ కప్ జట్టును ప్రకటించాలని అనుకుంటుందట. అయితే ప్రస్తుతం సొంత గడ్డపై వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో.. ఎలాగైనా కప్పు సాధించాలని కసితో ఉంది టీమిండియా. అయితే ఆసియా కప్ 2023లో ఆడే జట్టే దాదాపుగా ప్రపంచ కప్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు మార్పులు మినహా మిగతా జట్టు మొత్తం సేమ్ ఉండే అవకాశం ఉందట.