ప్రో కబడ్డీ లీగ్.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అటు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం అన్ని టీమ్స్ కూడా సిద్ధమైపోతున్నాయి. అంతేకాదు క్రికెట్ ప్రపంచం మొత్తం అటు వరల్డ్ కప్ మ్యాచ్లను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే అటు ఆసియా కప్ టోర్నీ ప్రేక్షకులను అలరించబోతుంది. దీంతో క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా పండగ వాతావరణం నెలకొన పోతుంది అని చెప్పాలి. అయితే కేవలం క్రికెట్ ప్రేక్షకులకే కబడ్డీ ప్రేక్షకులకు కూడా అదే రీతిలో ఎంటర్టైన్మెంట్ అందుతుంది.

 ఎందుకంటే అటు వరల్డ్ కప్ ముగిసిందో లేదో అంతలోనే మరో టోర్ని ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇది క్రికెట్ టోర్నీనే కాదు ప్రో కబడ్డీ లీగ్. కబడ్డీ అంటే భారత్ లో ఏ రేంజ్ లో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పెద్దవాళ్లుగా ఉన్న వాళ్ళందరూ చిన్నప్పుడు ఈ కబడ్డీ ఆటను ఎప్పుడో ఒకసారి ఆడే ఉంటారు. అందుకే కబడ్డీని ప్రతి ఒక్కరి ఆటగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక ప్రో కబడ్డీ లీగ్ ద్వారా కబడ్డీ  ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు సరికొత్తగా అందించడం మొదలైంది. ఇక ఈ లీక్ తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. కాక ప్రో కబడ్డీ లీగ్ పదవ సీజన్ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కాబోతుందట.

 ఈ క్రమంలోనే డిసెంబర్ రెండవ తేదీ నుంచి పదవ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ప్రారంభించబోతున్నట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు.ఏకంగా గత సీజన్లను మరిపించే విధంగా ఈసారి లీక్ నిర్వహిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు త్వరలోనే పూర్తి షెడ్యూల్ ని కూడా విడుదల చేస్తాము అంటూ ఆయన తెలిపారు. అయితే ఈసారి ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లను దేశంలోని 12 నగరాలలో నిర్వహించాలని నిర్ణయించాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ఇక ఆ తర్వాత వరల్డ్ కప్ అటు వెంటనే ప్రో కబడ్డీ లీగ్ ఇలా క్రీడా అభిమానులందరికీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ లభించబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: