యూటర్న్ తీసుకున్న అంబటి రాయుడు.. మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు?
అయితే ఇలా అంబటి రాయుడు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయ నాయకులతో వరుసగా కలుస్తూ ఉండడంతో అంబటి రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెడతాడని అందరూ అనుకున్నారు కానీ ఊహించిన రీతిలో మరోసారి యూటర్న్ తీసుకున్నాడు అంబటి రాయుడు. భారత క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు ఇక ఇప్పుడు విదేశీ లీగ్లలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తోంది. మరోసారి బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగిపోతున్నాడు ఈ 37 ఏళ్ల కుడి చేతివాటం బ్యాట్స్మెన్ ఇక ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.
భారత్లో అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్ కు కూడా వీడ్కోలు పలికిన రాయుడు కరేబియన్ లీగ్ తో మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ క్రమంలోనే సెయింట్ కిట్స్, నేవీస్ పేట్రియాట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక ఈ లీగ్ లో ఆడుతున్న రెండో భారత క్రికెటర్ గా రికార్డ్స్ సృష్టించాడు అంబటి రాయుడు అంతకుముందు ఇక కరేబియన్ లీగ్ లో ప్రవీణ్ తాంబే ఒక్కడే ఇక ఆడాడు అని చెప్పాలి. మరి ఈ లీగ్ ద్వారా అంబటి రాయుడు ప్రస్థానం ఎలా కొనసాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.