అప్పుడంటే గెలిచారు కానీ.. ఇప్పుడు వరల్డ్ కప్ కష్టమే?

praveen
2011 లో టీం ఇండియా వన్ డే ప్రపంచకప్ గెలిచింది కానీ 2023 లో గెలవడం కష్టమే అని వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నాయి. వసీం అక్రమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఎదో  వ్యాఖ్యలతో వైరల్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు టీం ఇండియా విజయావకాశాలపై మాట్లాడి మరోసారి వైరల్ అయ్యారు.

టీం ఇండియా 2011 లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో వన్ డే ప్రంపంచకప్ గెలిచిన విషయం అందరికి తెలిసిందే. బ్యాటింగ్ లో ముందు వచ్చిన ధోని అదిరిపోయే సిక్స్ కొట్టి 28 భారతీయుల కలని నిజం చేసాడు. ఫైనల్ లో శ్రీలంకును ఓడించిన భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఆ తరువాత ఏ ప్రపంచకప్ లోను భారత్ గెలవలేదు. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్స్ లో కూడా ఓడిపోయింది. అయితే 12 ఏళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ టీం ఇండియాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. 2023 వన్డే ప్రప్రంచకప్ భారత్ లోనే జరగనుంది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఈసారి భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే టీం ఇండియా కచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని ఇప్పుడే చెప్పలేం. దీనికి కారణం టోర్నీ ఇండియాలోనే జరుగుతున్నా ఆటగాళ్లపై ఒత్తిడి ఉంది. పైగా ఈసారి అన్ని జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయనే చెప్పాలి. అయితే రోహిత్ సారథ్యంలో టీం ఇండియా జట్టు బలంగానే కనిపిస్తుంది. ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ అందించాలని రోహిత్, విరాట్ పట్టుదలతో ఉన్నారు.

అయితే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మాట్లాడుతూ 2015, 2019లలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు వరల్డ్ కప్ కు ముందే ఓ హెచ్చరిక జారీ చేశాడు. "భారత జట్టులో మహ్మద్ షమీ రూపంలో అద్భుతమైన బౌలర్ ఉన్నాడు. కానీ బుమ్రా పరిస్థితేంటో నాకు తెలియదు. కానీ అతడు జట్టులో ఉంటే మాత్రం కథ వేరుగా ఉంటుంది. జడేజా, అశ్విన్ రూపంలో స్పిన్నర్లకు కొదవలేదు. అయితే వీరిలో ఎవరు ఆడతారో తెలియదు అని వ్యాఖ్యానించాడు. 2011లో ఇండియా గెలిచారు కానీ ఇప్పుడూ కాస్త కష్టమే. అదనపు ఒత్తిడి ఉంటుంది. పాకిస్థాన్ విషయంలోనూ అంతే. ఒకవేళ వాళ్లు ఆతిథ్యం ఇచ్చి ఉంటే వాళ్లపై కూడా ఒత్తిడి ఉండేది.." అని అక్రమ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: