బజ్‌బాల్‌తో టీం ఇండియాకు టెన్షన్.. బెన్ స్టోక్స్ స్ట్రాంగ్ వార్నింగ్?

praveen
యాషెస్ సిరీస్ ముగిసింది. 2 - 2 తో లెవెల్ అయ్యింది. అయితే మరో మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. అయితే ఆ మ్యాచ్ జరిగి ఉంటె ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇక చివరి రోజు ఇంగ్లాండ్ పేసర్ల దెబ్బకి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక యాషెస్ సిరీస్ లో బ్రాడ్ రిటైర్మెంట్ కూడా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ చివరి టెస్ట్ గెలిచాక సంతోషంతో ఉంది. ఇదే ఊపులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీం ఇండియాకు ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు జారీచేశాడు. సౌతాఫ్రికా, పాకిస్థాన్,ఆస్ట్రేలియా జట్లలానే భారత్‌కు బజ్‌బాల్ రుచిచూపిస్తామని తెలిపాడు.
గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ టెస్టుల్లో అదరగొడుతుంది. బెన్ స్టోక్స్ సారథ్యంలో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇక బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్‌గా.. బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్ ను టాప్ లో పెడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 18 టెస్ట్‌లు ఆడిన ఇంగ్లండ్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంగ్లాండ్ ఎలా తయారయ్యిందో అని. గత కొన్ని నెలలుగా బజ్‌బాల్ అనేది వైరల్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. బజ్‌బాల్ గేమ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ వరుస సిరీస్ లు గెలుస్తూ వస్తుంది. న్యూజిలాండ్‌తో  3-0తో ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. సౌతాఫ్రికా గడ్డపై ఇదే బజ్‌బాల్ గేమ్‌తో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ గడ్డపై 3-0తో గెలిచింది. ఇక యాషెస్ లో ముందు రెండు టెస్టుల్లో ఒదిన ఇంగ్లాండ్ అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది. వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ జరిగి ఉంటె, ఇంగ్లాండ్ గెలిచి ఉంటె హ్యాట్రిక్ విజయాలతో ఆస్ట్రేలియాను ఓడించెదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఇంగ్లాండ్ ఫిబ్రవరిలో ఇండియాతో టెస్ట్ మ్యాచులు ఆడనుంది. ఆసీస్‌తో చివరి టెస్ట్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్‌ను భారత్ వేదికగా ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్ వర్కౌట్ అవుతుందా? అని ఓ మీడియా ప్రతినిధి అడగగా.. దానికి కాలమే సమాధానం చెబుతుందని అతను బదులిచ్చాడు. దీంతో టీం ఇండియాకు ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు పంపించాడు. భారత్ గడ్డపై 2012-13లో చివరిసారిగా విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత రెండు సార్లు 4-0, 3-1తో ఓటమిపాలైంది. ఇప్పడూ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ ఫిబ్రవరిలో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. దీంతో ఇప్పుడు స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: