వామ్మో.. వాళ్లిదరు రిటైర్ ఐతే.. టీమ్ ఇండియా గతేంటో?

praveen
టీం ఇండియా ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ టూర్ లో ఉంది. రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ 20 మ్యాచ్లు ఆడేందుకు జులై మొదటి వారంలో క్యారిబ్బియన్ కు బయలుదేరిన టీం ఇండియా, ఇప్పటికే  ఒక విజయం మరియు ఒక డ్రా తో టెస్ట్టె సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ చేజిక్కించుకున్నప్పటికీ ఇండియా ప్రదర్శన మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
 
2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తరువాత, ఇప్పుడు జరుగుతున్నా వెస్ట్ ఇండీస్ టూర్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడాన్ని తప్పుబట్టారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 2023 వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ టోర్నీకి అర్హత కూడా సాధించలేని వెస్ట్ ఇండీస్ టీంతో ఆడేందుకు సీనియర్ ప్లేయర్స్ ను పంపేకంటే, కొత్త ప్లేయర్స్ కి అవకాశం ఇస్తే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా టెస్ట్ సిరీస్ లో, రోహిత్, విరాట్ సాధించిన సెంచరీలను కూడా చులకన చేసి మాట్లాడారు. ఏమాత్రం ఫామ్ లో లేని వెస్ట్ ఇండీస్ పై సెంచరీలు చేసారని వెటకారంగా మాట్లాడారు. ఐతే చాలామంది విశ్లేషకులు ఆయన మాటలతో అంగీకరించారు కూడా. కానీ గవాస్కర్ అన్నట్టు సీనియర్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇస్తే ఏమై ఉండేదో, వన్ డే సిరీస్ తో అర్ధమైపోయింది అందరికి.  

మొదటి వన్ డే లో మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్ట్ ఇండీస్ 23 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసి అల్ అవుట్ అయ్యింది. ఈ టార్గెట్ ను టీం ఇండియా 22.5 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండో వన్ డే లో యంగ్ స్టర్స్ కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ లైన్ అప్ ను మార్చింది ఇండియా. రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చి సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు. ఫ్యూచర్ స్టార్స్, ప్రిన్స్ , భావితరానికి దిగ్గజ బ్యాటర్లు అని ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న కుర్ర ప్లేయర్లు బొక్కబోర్లా పడ్డారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత 40.5 ఓవర్లకు 181 మాత్రమే చేసి అల్ అవుట్ అయ్యింది. వెస్ట్ ఇండీస్ 36.4 ఓవర్లలో ఈ టార్గెట్ ను ఛేదించింది.  హార్ధిక్ పాండ్యా,  సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్...ఇలా మ్యాచ్ విన్నర్లు గా పేరు తెచుకున్నవారంతా ఫెయిల్ అయ్యారు. ఈ యంగ్ స్టర్స్ ప్రదర్శన చూస్తుంటే టీం ఇండియా భవిష్యత్తు పై భయం వేస్తుంది అభిమానులకు. కొన్నేళ్ల క్రితం, మహేళ జయవర్ధనే, సంగక్కర, దిల్షాన్, మలింగా వంటి ప్లేయర్లు రిటైర్ అయ్యాక, శ్రీ లంక టీం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. 2011 లో ఇండియాతో వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టు, టోర్నీకి అర్హత కూడా సాధిచలేని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ, వంటి సీనియర్ ప్లేయర్స్ లేకపోతే టీం ఇండియాది కూడా అదే పరిస్థితా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: