సంజూ జెర్సీలో సూర్య.. అయినా మారని లక్?
సరే టెస్ట్ ఫార్మాట్లో అయితే ఓకే గాని వన్డే ఫార్మాట్ లో అయితే సూర్యకుమార్ బాగా రాణిస్తాడని అందరూ అనుకున్నారు కానీ సూర్య కుమార్కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వన్డే ఫార్మాట్లో ఇమడ లేకపోతున్నాడు. అయితే అతను వరుసగా విఫలమవుతున్న.. సెలెక్టర్లు మాత్రం అతనిపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు కానీ అతను మాత్రం వన్డే ఫార్మాట్ కి అలవాటు పడలేకపోతున్నాడు అని చెప్పాలి. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసిన బౌలర్లు మారిన సూర్య బ్యాట్ నుంచి పరుగులు మాత్రం రావట్లేదు.
వరల్డ్ కప్ లో ఎట్టి పరిస్థితుల్లో అతని ఆడించాలని డిసైడ్ అయిన టీమ్ ఇండియా యాజమాన్యం.. ఇక వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో కూడా మరోసారి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గతంలో 6 మ్యాచ్ లలో నాలుగు సార్లు డక్ ఔట్ అయిన సూర్య కుమార్ యాదవ్. న్యూజిలాండ్తో మూడో వన్డేలో 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక ఇదే సిరీస్లో హైదరాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ 26 బంతులను 31 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు. అంతేకాదు స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ తేలిపోయాడు. గతంలో అర్షదీప్ జర్సీతో కనిపించాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ఇటీవల సంజు జెర్సీ వేసుకుని ఫీల్డింగ్ చేశాడు.
అయితే సంజు జెర్సీలో వచ్చిన సూర్య కు కూడా అదృష్టం కలిసి రాలేదు అన్నది తెలుస్తోంది. ఎందుకంటే 25 బంత్రులు మూడుసార్లు ఒక సిక్సర్ సహాయంతో 19 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. అయితే కొట్టాల్సిన లక్ష్యం 115 పరుగులు ఉండడంతో.. రోహిత్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కి రాకుండా ఇషాన్ కిషన్, శుభమన్ గిల్తో ఓపెనింగ్ చేయించారు అయితే తక్కువ స్కోరు మాత్రమే ముందుండడంతో టీమిండియా ఎంతో అలవోకగా విజయం సాధిస్తుంది అనుకున్నప్పటికీ. స్వల్ప టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే సూర్య కుమార్ సంజు జెర్సీలో రావడం మాత్రం హాట్ టాపిక్ మారింది.