ఐపీఎల్ లో ఏపీ టీం.. ప్రయత్నాలు మొదలు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని మరింత ఉత్కంఠ భరితం గా మార్చేందుకు ప్రేక్షకులందరికీ ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు అటు బీసీసీఐ ఎప్పటికప్పుడు సరికొత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే 8 జట్లతో ప్రేక్షకులకు అలరిస్తున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లను తీసుకువచ్చింది బీసీసీఐ. ఈ క్రమం లోనే గత ఏడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు  తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ అనే రెండు జట్లను ఐపీఎల్లోకి తీసుకు వచ్చింది బీసీసీఐ.


 అయితే ఇక ఐపీఎల్ లో ప్రస్తుతం పది జట్లు కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా పది జట్లుగా ఉన్న వాటి సంఖ్యను మరింత పెంచే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది  అన్నది తెలుస్తుంది. ఈ క్రమం లోనే ఏపీ కోసం ప్రత్యేకం  గా ఒక ఫ్రాంచైజీ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలను అవకాశమిస్తుండగా.. ఇక బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తుంది. ఇక ఇందుకోసం అటు పారిశ్రామిక వేతలతో కలిసి రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు.



 ఆటగాళ్ల  ప్రాక్టీస్ కోసం ఆధ్యాత్మిక వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి జగన్ ఆదేశించారు అంటూ ఆయన తెలిపారు. విశాఖలో ఉన్న స్టేడియం ఇక ఆంధ్రప్రదేశ్ టీంకి హోమ్ గ్రౌండ్ గా మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఒకవేళ  ఏపీ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయితే మాత్రం ఇక ఐపీఎల్ లోకి కొత్తగా ఆంధ్ర నుంచి ఒక ఫ్రాంచైజీ   ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే తెలంగాణ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు  ఐపీఎల్ లో కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: