అత్యంత అరుదైన రికార్డుకు.. చేరువలో విరాట్ కోహ్లీ?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే ఇప్పటివరకు అతను సృష్టించిన రికార్డులు అలాంటివి. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ వారి వారి కాలంలో సృష్టించిన రికార్డులను విరాట్ కోహ్లీ ఒక్కడే బద్దలు కొట్టేసాడు. అది కూడా అతి తక్కువ సమయంలోనే. అదే సమయంలో నేటితరం క్రికెటర్లు ఎవరూ అందుకోలేని రీతిలో రికార్డుల విషయంలో అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చి నిరూపించుకోవాల్సి ఉన్న ఆటగాడిలాగా కనిపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో కసితో కనిపిస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీలో ఉండే ఇలాంటి యాటిట్యూడ్ అభిమానులందరినీ కూడా ఫిదా చేసేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మరో రికార్డ్ సాధించబోతున్నాడు అని చెప్పాలి.


 ఈనెల 20వ తేదీ నుంచి జరగబోయే రెండో టెస్టు ద్వారా విరాట్ కోహ్లీ అరదైన రికార్డును ఖాతాలో వేసుకోబోతున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 500 మ్యాచ్లు ఆడిన పదవ ఆటగాడుగా ఘనత సాధించబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ లిస్టులో సచిన్ 664 మ్యాచులతో ఆగ్రస్థానంలో ఉండగా జయవర్ధనే 652 మ్యాచ్ లతో రెండవ స్థానంలో ఉన్నాడు. సంగకర 594, రికీ పాంటింగ్ 560, మహేంద్రసింగ్ ధోని 538, ఆఫ్రిది 524, కల్లిస్519, రాహుల్ ద్రావిడ్  509 మ్యాచ్లతో ఈ లిస్టులో ఉన్నారు. ఇంక ఇప్పుడు ఈ లిస్టులో అటు విరాట్ కోహ్లీ కూడా చేరబోతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: