ఉతికి ఆరేసాడు.. టీమిండియా ఫ్యూచర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది?

praveen
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్ లో కూడా సిరీస్ లు ఆడాల్సి ఉంది టీమిండియా. ఇక ఇప్పటికే వెస్టిండీస్, టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. కాగా ఇక అందరూ ఊహించినట్లుగానే టెస్ట్ సిరీస్ లో శుభారంభం చేసే దిశగా ముందుకు సాగుతుంది టీమ్ ఇండియా. ఆతిథ్య వెస్టిండీస్ పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది అని చెప్పాలి.


 మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ను అటు భారత బౌలర్లు ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. దీంతో కేవలం 150 పరుగులు మాత్రమే చేసిన వెస్టిండీస్ జట్టు చివరికి ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి. ఇక తర్వాత తక్కువ టార్గెట్ తోనే బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా అటు మొదటిసారి టీమిండియా తరఫున ఆడుతున్న యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్  దేశవాళీ  క్రికెట్లో లాగానే ఇక అటు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తన మార్కు చూపించాడు అని చెప్పాలి.


 ఎలాంటి ఒత్తిడి లేకుండా చెలరేగి ఆడిన యశస్వి జైష్వాల్ ఏకంగా సెంచరీ తో చలరేగిపోయాడు. మొత్తంగా 143 పరుగులు చేసి నాట్ అవుట్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక మరోవైపు నుంచి రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత సెంచరీ తో అతడు కొట్టి అభిమానులు అందరిని కూడా ఆందోళనలో ముంచేసాడు అని చెప్పాలి. ఈ ఓపెనింగ్ జోడి తొలి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 312/2 గా ఉంది. కాగా ప్రస్తుతం క్రీజ్ లో 143 పరుగులతో యశస్వి జైష్వాల్.. 36 పరుగులతో కోహ్లీ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: