పెళ్లి తర్వాత జీవితం.. ఎంతో అసహ్యంగా ఉండేది : సంగీత
ప్రముఖ సింగర్ కృష్ణ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సంగీత. ఆ తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. కానీ ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. హీరోయిన్లకు తల్లిపాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏకంగా రష్మిక మందన్న తల్లి పాత్రలో నటించింది హీరోయిన్ సంగీత. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత తన వైవాహిక జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో అసహ్యం గా గడిచింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ హీరోయిన్. సింగర్ కృష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇరు కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. పెళ్లి తర్వాత గొడవలు జరగడం నాపై ఒత్తిడి పెరిగిపోవడంతో మ్యారేజ్ లైఫ్ ను అసహ్యించుకున్నాను. ఇక ఇలాంటి లైఫ్ నుంచి బయటపడాలని ప్రయత్నించాను. కానీ నన్ను వదులుకోవడం అటు క్రిష్ కు ఇష్టం లేదు. ఆయన నన్ను ఎప్పుడు మోటివేట్ చేసేవారు. ఇక అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాం అంటూ చెప్పుకొచ్చింది సంగీత.