మా ఆట ఇంతే.. మేము మార్చుకోం : స్టోక్స్

praveen
టెస్ట్ ఫార్మాట్ ని సుదీర్ఘమైన ఫార్మాట్ గా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే పరిమిత ఓవర్ల ఫార్మట్ లోలాగా పరిమితంగా బంతులు ఉండవు. ఆడుకూన్నోళ్లకు ఆడుకున్నంత అనే విధంగా ఒక టెస్ట్ ఫార్మాట్లో అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అందుకే క్రిజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు చేయాలి అని కాదు.. ఎక్కువ సమయం పాటు క్రీజ్ లో పాతుకు పోవాలి అని భావిస్తూ ఉంటారు. ఇక టెస్ట్ ఫార్మాట్ ప్రారంభమైన నాటి నుంచి కూడా అందరూ ఇదే ఆట తీరును కొనసాగిస్తున్నారూ. కానీ ఇటీవల కాలంలో ఇంగ్లాండ్  మాత్రం టెస్టు ఫార్మాట్ కు సరికొత్త అర్ధాన్ని చెప్పింది.


 ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ లాగా దూకుడుగా ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్కు కోచ్గా మెకళ్ళమ్ వచ్చిన తర్వాత ఈ బజ్ బాల్ అనే కొత్త విధానాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇటీవల సిరీస్ లో భాగంగా అటు బజ్ బాల్  విధానం ద్వారా ఆస్ట్రేలియను బోల్తా కొట్టించాలని భావించిన ఇంగ్లాండ్  వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ ఫాలో అవుతున్న baj బాల్ విధానం బెడిసి కొట్టింది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి.


 ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కూడా కొంతమంది ఈ పద్ధతి సరికాదు అన్నట్లుగా మాట్లాడారు. ముఖ్యంగా తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడాన్ని ఘోర తప్పిదంగా పేర్కొంటూ ఎంతో మంది విమర్శలు గుప్పించారు. ఇక ఇటీవలే మూడో టెస్ట్ మ్యాచ్ విజయం సాధించి సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ స్పందించాడు. సిరీస్ పై ఆశలను నిలబెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి. కానీ మా శైలి మాత్రం అదే విధంగా కొనసాగుతుంది. మేము ఆడే విధానం సరిగా ఉందని.. నేను గత వారమే చెప్పాను. అది ఎప్పటికీ మారదు. ఎప్పుడు మా ఆట తీరు ఒకేలా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు స్టోక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: