ప్చ్.. డేవిడ్ వార్నర్ చెత్త రికార్డు?
అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎంతో హోరాహోరీగా యాషెష్ సిరీస్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఈ సిరీస్ లో భాగంగా ఇరుజట్ల ఆటగాళ్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది. ఇలాంటి సమయంలోనే ఇక హోరాహోరీగా జరుగుతున్న పోరులో కొంతమంది మంచి ప్రదర్శన చేసి ఎన్నో అరుదైన రికార్డులు కొల్లగొడుతూ ఉంటే.. ఇంకొంతమంది చెత్త ప్రదర్శనతో వరస్ట్ రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇక మూడో టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెత్త రికార్డును నమోదు చేశాడు. స్టువర్టు బ్రాడ్ బౌలింగ్లో అవుట్ అవ్వడం ద్వారా ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు వికెట్ సమర్పించుకున్న నాలుగవ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు స్టువర్టు బ్రాడ్ బౌలింగ్లో 16 సార్లు వికెట్ కోల్పోయాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా మాజీ బోర్డర్ మెక్ గ్రాత్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మైఖేల్ అథేర్తాన్ అత్యధికంగా 19 సార్లు అవుట్ అయ్యాడు. అలెన్ బెడ్సల్ బౌలింగ్ లో మోరిస్ 18 సార్లు.. అంబ్రోస్ బౌలింగ్లో మైఖేల్ అథర్టన్ 17 సార్లు అవుట్ అయ్యారు అని చెప్పాలి.