హమ్మయ్య.. తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ?

praveen
ఇటీవల కాలంలో ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు అత్తి తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో చోటు తగ్గడం ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నామ్. ఒకప్పుడు దేశవాళీ క్రికెట్లో రాణించిన ప్లేయర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఐపీఎల్ కి పెరిగిపోయిన పాపులరిటిని దృష్టిలో పెట్టుకుని.. ఇక ఐపీఎల్లో రాణించిన ప్లేయర్లకే భారత జట్టులోకి ఎంపిక చేయడం విషయంలో పెద్దపీట వేస్తున్నారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో టీమిండియాలో యంగ్ క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఐపిఎల్ లో ఆడటం ద్వారా వాళ్లే టీమిండియా ఫ్యూచర్ సార్స్ అని నిరూపించుకున్న ఆటగాళ్లలో  తెలుగు తేజం తిలక్ వర్మ కూడా ఒకరు అని చెప్పాలి.



 2022 ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అతను అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్ లో తన సత్తా ఏంటో నిరూపించాడు. ఒకవైపు ముంబై జట్టు పూర్తిగా విఫలం అవుతున్నప్పటికీ.. తిలక్ వర్మ మాత్రం నిలకడైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. దీంతో అతని బ్యాటింగ్ శైలి చూసి అతను తప్పకుండా టీమిండియా కు ఫ్యూచర్ స్టార్ అవుతాడని అందరూ భావించారు. ఐపీఎల్ సీజన్ లో కూడా తిలక్ వర్మ మరోసారి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.  ఇలా తన ఫామ్ తో సెలక్టర్లు దృష్టిని ఆకర్షించిన తిలక్ వర్మ  ఇటీవల టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు.


 వెస్టిండీస్తో జరగబోయే టి20 సిరీస్ కోసం ఇటీవల జట్టు వివరాలను ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. అయితే ఈ టి20 సిరీస్ లో భాగంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ టీమిండియా కు ఎంపీక అయ్యాడు. ఐపీఎల్ లో 2022 సీజన్లో 397 వరకు 2023 సీసన్ లో 343 పరుగులు చేసి రాణించాడు. అయితే తిలక్ వర్మకి టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉందని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు క్రికెటర్ కు టీమిండియాలో ఛాన్స్ దక్కడంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అతనికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: