ధావన్ కాదు.. కెప్టెన్గా అతనైతేనే బెటర్ : డీకే
అయితే ఆసియా క్రీడలకు అటు భారత క్రికెట్ జట్టును పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా అంగీకరించింది. దీంతో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా అక్కడికి వెళుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఇక అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ ఉండడంతో ప్రధాన ఆటగాళ్లు కాకుండా ఇక టీమిండియా బీ టీం ని ఆసియా గేమ్స్ కు పంపుతారని ఎంతో మంది మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉందని.. అతని నాయకత్వంలోని ఇక టీమిండియాను ఆసియా గేమ్స్ కు పంపబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే టీమిండియా సారధిగా శిఖర్ ధావన్ కంటే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెటర్ అంటూ సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. అశ్విన్ ప్రపంచకప్ ప్రాబబుల్స్ లో లేకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటు సూచించాడు. కొన్నెళ్ల నుంచి అతడు భారత క్రికెట్లో అందించిన సేవలకు గాను.. ఇక అతను కెప్టెన్సీ చేపట్టేందుకు అర్హత ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అతను గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని గణాంకాలు పరిశీలిస్తే ఆ విషయం అర్థమైపోతుంది అయితే వరల్డ్ కప్ జట్టులో అతను పరిగణలో లేకపోతే ఇక ఆసియా గేమ్స్ కు కెప్టెన్ గా పంపిస్తే బాగుంటుంది అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.