ఆ ఇద్దరినీ పక్కన పెట్టడంతో.. ఆశ్చర్యపోయా : గంగూలి
ఈ క్రమంలోనే అటు దేశవాళి క్రికెట్లో మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను వదిలేసి కేవలం ఐపిఎల్ లో మాత్రమే మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్లను జట్టులోకి ఎంపిక చేయడం ఏంటి అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్స్ కూడా టీమిండియా సెలెక్టర్ల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల టీమిండియా వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టు గురించి భారత మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న సర్పరాజ్ ఖాన్, అభిమన్య ఈశ్వరన్ లను జట్టులోకి ఎంపిక చేయకపోవడం నిజంగా తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ సౌరబ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత కొంతకాలం నుంచి దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి అదరగొడుతున్న సర్ఫారాజ్, అభిమన్యు ఈశ్వరన్ లకు భారత జట్టులో చోటు కల్పించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక రానున్న రోజుల్లో అయినా వారిద్దరిని కూడా జట్టులోకి తీసుకోవాలి అంటూ సూచించాడు ఈ మాజీ ఆటగాడు. అయితే మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఇక జట్టు సెలక్షన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక ఇదే రీతిలో స్పందిస్తున్నారు అని చెప్పాలి.