క్వాలిఫైయర్ మ్యాచ్లో.. జింబాబ్వే సంచలన విజయం?
ఈ క్రమంలోనే క్వాలిఫైయర్ మ్యాచ్లలో అటు పసికూనగా ఉన్న జింబాబ్వే జట్టు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది. వరుస విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల యుఎస్ఎతో జరిగిన మ్యాచ్లో కూడా జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇప్పుడు ఇదే ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విజయం ద్వారా అటు వరల్డ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించింది. ఏకంగా అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది.
ఇటీవల క్వాలిఫైయర్ మ్యాచ్లలో భాగంగా జింబాబ్వే యూఏఈ జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు అదిరిపోయే ప్రదర్శన చేయగా.. ఏకంగా 408 పరుగులు చేసింది. అయితే కొండంత టార్గెట్ తో బలిలోకి దిగిన యుఎస్ఏ జట్టు ఎక్కడ ప్రభావం చూపలేకపోయింది. అటు జింబాబ్వే బౌలర్ల దాటికి యుఎస్ఎ బ్యాటింగ్ విభాగం మొత్తం చేతులెత్తేసింది.దీంతో 104 పరుగులు మాత్రమే చేసి యుఎస్ఏ టీం చాప చుట్టేసింది. దీంతో జింబాబ్వే 304 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇది వన్డే ఫార్మాట్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం కావడం గమనార్హం. గతంలో శ్రీలంకపై భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇదే ఇప్పటికీ వన్డే క్రికెట్లో అతిపెద్ద విజంగా కొనసాగుతుంది.