వారెవ్వా.. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు?
అయితే కేవలం ప్రస్తుతం యాషెష్ సిరీస్ అటు పురుషుల జట్ల మధ్యే కాదు మహిళల టీమ్స్ మధ్య కూడా జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే పురుషుల జట్టు విషయానికి వస్తే అటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పై ఆధిపత్యం సాధించాలని మొదటి మ్యాచ్లో అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. కానీ ప్లాన్ బోల్తా కొట్టి చివరికిమొదటి మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే అటు పురుషుల క్రికెట్లో ఇంగ్లాండ్ టీం నిరాశపరిచినప్పటికీ మహిళల టీంలో మాత్రం ఇంగ్లాండ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇంగ్లాండ్ బ్యాటర్ బ్యూమంట్ ఏకంగా డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది అనే విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మహిళల యాషెష్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ నెక్లెస్టోన్ అదరగొట్టింది. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఐదు వికెట్ల చొప్పున మొత్తం 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సృష్టించింది. ఒక్క మ్యాచ్లో 10 వికెట్లు తీసిన నాలుగవ బౌలర్గా రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి. ఎక్లాస్టోన్ దాటికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 257 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ విజయానికి 268 పరుగులు కావాల్సి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోని ఇంగ్లాండు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.