చిన్న ధోని.. హెలికాప్టర్ షాట్ తో ఫిదా చేస్తున్నాడు?

praveen
టీమిడియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ లో కెప్టెన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్ గాను కొనసాగుతున్నాడు. అయితే కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు ఆటగాడిగా కూడా మహేంద్రసింగ్ ధోనీకి అదే రేంజ్ లో గుర్తింపు ఉంది. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ ఎవరు అంటే ఇప్పటికీ కూడా ధోని పేరును చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో మైదానంలో ధోని ఉన్నాడు అంటే చాలు ఇక మ్యాచ్ తప్పకుండా గెలుస్తామని అభిమానులు బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఒక మహేంద్ర సింగ్ ధోని కొట్టే సిక్సర్ల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. ముఖ్యంగా ధోని బ్యాటింగ్ లో ఉండే హెలికాప్టర్ షాట్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ధోని ఎప్పుడైనా హెలికాప్టర్ షాట్ కొట్టాడు అంటే చాలు ఇక మైదానంలో ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతూ ఉంటారు. ఇక ధోని లాగానే ఎంతోమంది క్రికెటర్లు హెలికాప్టర్ షాట్ ప్రయత్నించినప్పటికీ ధోనిలా సక్సెస్ కాలేకపోయారు. కానీ ధోని శిష్యుడు హార్దిక్ పాండ్య మాత్రం అప్పుడప్పుడు ధోనిని తలపించే విధంగా హెలికాప్టర్ షాట్ ఆడుతూ ఉంటాడు అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు హెలికాప్టర్ షాట్ కొడుతున్న ఒక చిన్న ధోనీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఓ చిన్న పిల్లవాడు ధోని స్టైల్ లో అద్భుతమైన హెలికాప్టర్ షాట్లు కొడుతున్నాడు. అతనికి దాదాపు 7 ఏళ్ల వయసు ఉండొచ్చు. కానీ ఈ వయసులో అతను బ్యాట్ పట్టుకుని షాట్లు కొడుతున్న తీరు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎంతో అనుభవం ఉన్న స్టార్ క్రికెటర్ లాగా అతని బ్యాటింగ్ శైలి కనిపిస్తుంది. ఇక హెలికాప్టర్ షాట్ అయితే అచ్చం ధోని లాగే కొడుతూ ఉన్నాడు. ఇక ఈ వీడియో చూసి అతను చిన్న దోని అంటూ ఎంతోమంది మహేంద్రడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: