వెస్టిండీస్ తో టెస్ట్ కు ముందు.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్?

praveen
ఈ ఏడాది వరస సిరీస్ లతో అటు టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్ గడప నుండి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది టీమిండియా. ఇక జూలై 12వ తేదీ నుంచి కూడా వెస్టిండీస్ తో సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆతిధ్య వెస్టిండీస్ జట్టుతో మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది. ఇక జూలై 12 నుంచి టీమ్ ఇండియా వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి.


 అయితే ఈ టెస్ట్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకున్న టీమ్ ఇండియా యాజమాన్యం ఇక టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టును కాస్త ముందుగానే ఇక విండిస్  గడ్డమీదికి పంపాలని నిర్ణయించుకుంది. ఒకటి, రెండు తేదీలలోనే బిసిసిఐ ఇక టెస్ట్ సిరీస్ జట్టును అక్కడికి పంపి ప్రాక్టీస్ చేయించాలని భావిస్తుందట. ఈ క్రమంలోనే వెస్టిండీస్తో జరిగే టెస్ట్ మ్యాచ్ కు ముందు వారం రోజులపాటు ట్రైనింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అటు కోచ్ రాహుల్ ద్రవీడు కూడా నిర్ణయించాడట. ఇక వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ల సిరీస్ కి ముందు అటు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుందట.


 ఇక ఇందుకోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చలు కూడా జరుపుతుంది అనేది తెలుస్తుంది. బిసిసిఐ అడిగిన తర్వాత వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకుండా ఉండదు. అందుకే తప్పకుండా రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే అటు టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే, టి20 సిరీస్ లు ఆడబోయే జట్టు వివరాలను కూడా ఇటీవల బీసీసిఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక వెస్టిండీస్ తో ఆడబోయే టెస్ట్ జట్టులో ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇస్తూ భారత్ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: