ఐపీఎల్ లో అదరగొట్టారు.. టీమిండియాలోకి వచ్చేసారు?

praveen
IPL 2023 అదరగొట్టిన ఆ స్టార్ ప్లేయర్స్ కి ఇండియా తరపున టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఇండియా వెస్ట్ ఇండీస్ టూర్ కి వెళ్తుంది. ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లకు అవకాహం దొరకనుందని సమాచారం. ఆ ఆటగాళ్లు ఎవరు, ఏ ఫార్మటు లో ఆడనున్నారో ఇప్పుడు చూసేద్దాం.
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఐపిఎల్ లో అదరగొట్టారు. ఐపిఎల్ లోనే కాదు. దేశవాళీ మ్యాచుల్లో కూడా ఈ యువ ఆటగాళ్లిద్దరూ అద్భుతంగా ఆడారు. దీంతో వీరికి వెస్ట్ ఇండీస్ సిరీస్ లో ఆడే అవకాశం ఉంది. జైస్వాల్ ఐపీఎల్ 2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అదరగొట్టాడు. అప్పుడే సీనియర్ ప్లేయర్స్ అందరు జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలోనే ఇండియాకు ఆడతారని కూడా చెప్పారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ధోని కెప్టెన్సీలో సిఎస్కే తరపున ఆడాడు. వీరిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్తో అభిమానుల దృష్టిని ఆకర్షించారు.
వెస్ట్ ఇండీస్ సిరీస్ లో ఛతేశ్వర్ పుజారా స్థానంలో యశస్వి జైస్వాల్ ని ఆడించే అవకాశం కూడా ఉంది. పుజారా జట్టులో ఉన్నా ప్లేయింగ్ 11 లో జైస్వాల్ ఉండే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ సిరీస్ లో విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తరువాత ఇండియా మొదటి టెస్ట్ సిరీస్ వెస్ట్ ఇండీస్ తో ఆడనుంది. అక్కడ మూడు ఫార్మాట్ లు ఆడాల్సి ఉంది. అయితే బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మకు ఎదో ఒక ఫార్మాట్ లో రెస్ట్ ఇవ్వనుందని సమాచారం. గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సీనియర్ లు ఎక్కువ పొట్టి ఫార్మాట్ లో ఆడడం లేదు. బీసీసీఐ కూడా 2024 టీ20 వరల్డ్ కప్ కు యువ జట్టును సిద్ధం చేస్తుంది. వెస్ట్ ఇండీస్ సిరీస్ లో T 20 కు రోహిత్ అదే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇక మిగిలింది టెస్టు, వన్డేలే. ఈ రెండు ఫార్మాట్ లలో కూడా ఒక దాంట్లో హిట్ మ్యాన్ కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తుంది.
జులై 12-16 మధ్య తొలి టెస్టు, 20-24 నుంచి రెండో టెస్టు జరుగనుండగా జులై 27 నుంచి ఆగస్టు 1 వరకూ మూడు వన్డేలు జరుగుతాయి.బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ‘ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్ కాస్త నీరసంగా కనిపించాడు. అతడు తన రిథమ్ను కోల్పోయాడు. అందుకే విండీస్ టూర్లో కొంత భాగం అతడికి విశ్రాంతినివ్వనివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే ఇది టెస్టులా, వన్డేలా..? అన్నది ఇంకా నిర్ణయించలేదు. రోహిత్తో మాట్లాడిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం..’ అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: