ఒకప్పుడు ధోని సహచరుడు.. కానీ ఇప్పుడు బస్ డ్రైవర్?
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి క్రికెటర్ గురించి భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిటైర్మెంట్ ప్రకటించిన ఇంకా అతని క్రేజ్ ఇసుమంతైన తగ్గలేదు అని చెప్పాలి. అలాంటి ధోనీకి వరల్డ్ కప్ లో ప్రత్యర్థిగా ఆడిన ఆటగాడి లైఫ్ ఎలా ఉంటుంది అంటే అందరూ లగ్జరీ లైఫ్ ను ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అతని విషయంలో అలా జరగలేదు. శ్రీలంక మాచి స్పిన్నర్ సూరజ్ రందేవ్ పరిస్థితి ఎంతో దీనంగా ఉంది. ఒకప్పుడు శ్రీలంక జట్టులో రెగ్యులర్ మెంబర్. 2011 వన్డే ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు. భారత్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోను ఆడాడు. 9 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చాడు.
ప్రస్తుతం రాందేవ్ ఆస్ట్రేలియాలోని మిల్ బోర్న్ లో ఉంటున్నాడు.. అక్కడ లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు అనుకుంటే పొరపాటే.. ఏకంగా బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మరో విచిత్రం ఏమిటంటే శ్రీలంక మాజీ ఆల్రౌండర్ చింతకా జయసింగె, జింబాబ్వే మాజీ ఆల్ రౌండర్ వాడింగ్ టన్ ఇదే కంపెనీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అయితే 2011లో ధోని కెప్టెన్సీ లోని చెన్నై జట్టులో కూడా ప్రాతినిథ్యం వహించాడు సూరజ్. అయితే ఒకవైపు డ్రైవర్ గా పనిచేస్తూనే.. మరోవైపు క్రికెట్తో సంబంధాలను కూడా కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధం అయ్యేందుకు ఆస్ట్రేలియా సూరజ్ ను నెట్ బౌలర్గా వినియోగించుకుంది అని చెప్పాలి.