నన్ను తీసుకోరని.. నాకు ముందే తెలుసు : అశ్విన్

praveen
ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్ గా కొనసాగుతున్న టీమ్ ఇండియాకు విశ్వ విజేతగా నిలవాలనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వరుసగా వరల్డ్ కప్ లు ఆడుతూ వస్తున్న టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళినప్పటికీ తర్వాత కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం బోల్తా పడుతూ తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉంది  ఇక ఇటీవల  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  ఫైనల్ మ్యాచ్లో కూడా ఇలాంటిదే చేసింది టీం ఇండియా.


 అయితే ఆస్ట్రేలియాను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలుస్తుంది అనుకుంటే.. కనీస పోటీ ఇవ్వలేక ఘోర ఓటమికి చవి చూసింది. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి  అన్న విషయం అదే సమయంలో ఇక టెస్ట్ ఫార్మాట్లో అనుభవం గల బౌలర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ కు తుది జట్టులో చోటు దాక్కకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అశ్విన్ను తీసుకోకపోవడం కారణంగానే టీమ్ ఇండియా ఓటమిపాలు అయ్యింది అంటూ ఎంతో మంది విమర్శలకు గుప్పించారు. అతన్ని తుది జట్టులోకి తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అంటూ అభిప్రాయపడ్డారు.


 ఇక ఇటీవల ఇదే విషయం గురించి రవిచంద్రన్ అశ్విన్ స్వయంగా స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆడటం లేదన్న విషయం తనకు ముందే తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. ఫైనల్ మ్యాచ్లో నలుగురు ఫేసర్లు ఒక స్పిన్నర్ ను ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. ఒకవేళ నేను ఆడి ఉంటే బాగుండేది. టీం ఓడిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. గత డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీశాను. ఇక 2019 నుంచి విదేశాలలో బాగా రాణిస్తూ ఉన్నాను. మ్యాచ్లో ఫోర్త్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్లకు బాగా కలిసి వస్తుంది అంటూ అశ్విల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: