వాళ్ల కోసం.. సంజు శాంసన్ ప్రతి ఏటా 2 కోట్లు ఖర్చు పెడతాడు?
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుని తన కెప్టెన్సీ తో ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు సంజు శాంసన్. అయితే మొన్నటి వరకు సంజు శాంసన్ కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై ఎంతో మంది అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సెలెక్టర్లను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఏకంగా టీమిండియా వెళ్లే బస్సులను సైతం అడ్డుకొని నినాదాలు చేయడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. సంజు శాంసన్ కు ఇంత మద్దతు లభించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే టీమిండియాలో అడపా దడప అవకాశాలు మాత్రమే దక్కించుకున్న సంజు శాంసన్ కు ఈ రేంజ్ లో మద్దతు పలకడం వెనక అతని ఆట మాత్రమే కాదు అతని గొప్ప మనసు కూడా ఉంది అన్న విషయాన్ని రాజస్థాన్ ట్రైనర్ చెప్పుకొచ్చాడు.
సంజు శాంసన్ ది ఎంత గొప్ప మనసు అన్న విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్రైనర్ కీలక విషయాలను వెల్లడించాడు. సంజు శాంసన్ ఏడాదికి దాదాపు 15 కోట్లు అందుకుంటారు. అందులో రెండు కోట్లు ప్రతిభ గల డొమెస్టిక్ ప్లేయర్లు ఇక పిల్లల కోసం వెచ్చిస్తూ ఉంటారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్లేయర్ గా కంటే సంజు శాంసన్ కు గొప్ప మనసున్న వ్యక్తిగా ఎక్కువ మంది అభిమానిస్తూ ఉంటారు. అందుకే సంజు శాంసన్ కు మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎక్కువ మద్దతు లభిస్తూ ఉంటుంది అంటూ ఇక రాజస్థాన్ ట్రైనర్ చెప్పుకొచ్చాడు.